కువైట్ లో చిరు జల్లులు...ఇవ్వాళ కూడా వర్షాలు

- November 22, 2021 , by Maagulf
కువైట్ లో చిరు జల్లులు...ఇవ్వాళ కూడా వర్షాలు

కువైట్: కువైట్ లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.  చిరుజల్లులతో కూడిన స్వల్ప వర్షం కారణంగా కువైట్ లో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. ఐతే సోమవారంకూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. స్వల్ప నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియవచ్చని తెలిపింది. అదే విధంగా ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని పిడుగులు పడే చాన్స్ ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ అధికారి అబ్దుల్ అజీజ్ అల్ ఖరావీ చెప్పారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com