ఒమన్ 51 నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా మస్కట్ గవ్నర్ విందు
- November 22, 2021
మస్కట్: ఒమన్ 51 వ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మంత్రులకు, అధికారులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. మస్కట్ లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మాట్లాడారు. అందరికీ 51 వ నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఒమన్ ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఒమన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని...ఆయన పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో పలువురు మంత్రులు, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మెంబర్లు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ సభ్యులు, సెక్రటరీలు, సీనియర్ మిలిటరీ కమాండర్లు, మస్కట్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







