బహ్రెయిన్ గవర్నరేట్లలో 1,410 కారు పార్క్స్ ఏర్పాటు
- November 23, 2021
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ విజయవంతంగా బహ్రెయిన్‌లోని పలు గవర్నరేట్లలోగల రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో కార్ పార్క్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,410 కార్ పార్క్‌లను దేశవ్యాప్తంగా 282,000 బహ్రెయినీ దినార్లతో ఏర్పాటు చేశారు. 310 కార్ పార్క్‌లను క్యాపిటల్ గవర్నరేటులో ఏర్పాటు చేయడం జరిగింది. ముహరాక్‌లో 300, నార్తరన్ గవర్నరేట్ 510, సౌత్ గవర్నరేటులో 290 ఏర్పాటు చేశారు. గత ఏడాది 1,730 కార్ పార్కులను నాలుగు గవర్నరేట్లకు కేటాయించారు. కాగా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సహకారంతో మినిస్ట్రీ, రెసిడెన్షియల్ ఏరియాల్లోని పార్కింగ్ మీటర్ల నుంచి ఫీజు మినహాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. రెసిడెంట్స్ కోసం ప్రత్యేకంగా స్టిక్కర్లు ఏర్పాటు చేసి మినహాయింపులు ఇస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







