యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా కొత్త నంబర్ ప్లేట్లు
- November 24, 2021అబుదాబి: యూఏఈ 50 వ జాతీయ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఇక్కడి ప్రభుత్వం ఘనంగా జరుపనుంది. డిసెంబర్ 2 నాడు 50 వ నేషనల్ డే ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడి రవాణా, ట్రాఫిక్ పోలీసు అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా కొనబోయే వాహనాలకు యూఏఈ 50 న నేషనల్ డే గుర్తుగా కొత్త నంబర్ ప్లేట్లను అమర్చనున్నట్లు అబుదాబి పోలీస్ శాఖ జనరల్ కమాండెంట్ తెలిపారు. నంబర్ ప్లేట్ పై ప్రత్యేకంగా 50 అనే నంబర్ ఉంటుంది. నేటి నుంచే కొనే వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు ఇవ్వనున్నారు. కొత్తగా రానున్న ప్లేట్లకు కోడ్ తో పాటు 50 అబుదాబి అనే పేరు ప్రత్యేకంగా కనిపించనుంది. ఈ నంబర్ ప్లేట్లను చాలా బాగున్నాయని దేశ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!