రివేంజ్ డ్రామాగా ఎన్టీఆర్ '30'..
- November 24, 2021రివేంజ్ డ్రామాగా ఎన్టీఆర్ '30' తెరకెక్కబోతోంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలబోతోంది.
ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అలాగే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను పూర్తి చేసిన తారక్ తన భార్య, పిల్లలతో కలిసి యూరప్ ట్రిప్‌కి వెళ్ళాడు. ఈ ట్రిప్ నుంచి రాగానే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కే సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయి.
ఒకవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే కొరటాల సినిమా షూటింగ్‌కు హాజరవనున్నాడు తారక్. కాగా, ఈ సినిమా రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. పూర్తిగా కొరటాల మార్క్‌తో ఉండబోతోందని స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించాడు. ఇక అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే సమ్మర్ కానుకగా ఎన్టీఆర్ '30' ప్రేక్షకులముందుకు రానుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్