హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త

- November 25, 2021 , by Maagulf
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త

అమెరికా: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్‌ సర్కారు అంగీకరించింది. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది.అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్‌-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ, గతంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు లేకుండా వీరు అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.

దీనిపై వలసదారుల జీవిత భాగస్వాములు ఏఐఎల్‌ఏను ఆశ్రయించగా.. వారు హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా బైడెన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా పని అనుమతులు పొందనున్నారు. ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా వెళ్లే వలసదారులకు ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 90వేలకు పైగా హెచ్‌-4 వీసాలను జారీ చేసారు.వీటిలో మెజార్టీ సంఖ్యలో భారతీయ మహిళలే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com