శివశంకర్ మాస్టర్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్..!
- November 25, 2021
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే.. కరోనాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు చెపుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు బాగా పెరిగిపోయాయని సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.శివశంకర్ కుటుంబసభ్యులతో సోనూసూద్ మాట్లాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు సోనూసూద్. కాగా శివశంకర్ మాస్టర్ తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా సినిమాలు చేశారు.నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. కేవలం డాన్స్ మాస్టర్ కాకుండా దాదాపుగా ఓ ముప్పై చిత్రాలలో ఆయన నటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..