నోటి దుర్వాసన పోవడానికి చిట్కాలు

- November 26, 2021 , by Maagulf
నోటి దుర్వాసన పోవడానికి చిట్కాలు

మనిషి ఎదురుకుంటున్న సమస్యల్లో నోటి దుర్వాసన అనేది ఒకటి.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకున్న సరే ఈ సమస్య వెంటాడుతుంది. దుర్వాసన కారణంగా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేము. దీనిని దూరం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.. ఈ దుర్వాసన సమస్యను ఈజీగా వదిలించుకోవచ్చు. సాధారణంగా మనం పళ్ళని శుభ్రం చేసుకున్న 12 గంటలు తర్వాత పళ్ళ నుంచి దుర్వాసన రావడం అంటూ మొదలవుతుంది.

  • ప్రతి 4, 5 గంటలకి మనం నోట్లో నీళ్లు పోసుకుని ఉమ్మేయాలి.
  • నోటిని మరియి గొంతును పొడిగా ఉండటం వలన కూడా దుర్వాసన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది.
  • నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బ్యాక్టిరియా కూడా వృద్ధి చెందదు.
  • ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఈ దుర్వాసనకి చెక్ పెట్టేయవచ్చు.
  • ధూమపానం, మద్యపానం మానేయాలి.. నోటిలో చాలా గంటలపాటు ఉంటుంది. తద్వారా నోటినుంచి దుర్వాసన వస్తుంది.
  • తులసి, పుదీనా వంటివి రోజువారి ఆహారంలో తీసుకుంటే ఈ నోటి దుర్వాసనకి చెక్ పెట్టేయవచ్చు.
  • సోంపుచక్కటి మౌత్ ఫ్రెషెనర్‌గా పని చేసి నోటి దుర్వాసనను అరికడుతుంది.
  • పెరుగు తినడం, గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com