డిజిటల్ లైసెన్స్ ఉన్న సరే వర్జినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే
- November 26, 2021కువైట్: కువైట్ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైెసెన్స్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాదారులు డిజిటల్ డ్రైవింగ్ లెసెన్స్ ఉన్నప్పటికీ వర్జినల్ లైసెన్స్ ను డ్రైవింగ్ చేసేప్పుడు క్యారీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.డిజిటల్ లైసెన్స్ ను యాక్సెప్ట్ చేయాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలే కువైట్ మొబైల్ ఐడీ యాప్ ను డ్రైవింగ్ లైెసెన్స్ లను అనుసంధానం చేసి డిజిటలైజేషన్ చేశారు.దీంతో చాలా మంది వాహనాదారులు ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని అడిగితే మొబైల్ యాప్ నుంచి డిజిటల్ లైసెన్స్ ను చూపిస్తున్నారు. ఐతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇది ట్రాఫిక్ నిబంధనల వాయిలేషనేనని స్పష్టం చేశారు. డిజిటల్ లైసెన్స్ చూపించి..వర్జినల్ లైసెన్స్ చూపించని చాలా మందిపై ఫైన్స్ కూడా వేశారు. ఈ విషయంపై వాహనాదారుల్లో గందరగోళం నెలకొనటంతో ట్రాఫిక్ విభాగం అధికారులు క్లారిటీ ఇచ్చారు.డిజిటల్ లైసెన్స్ ఉన్న సరే వర్జినల్ లైసెన్స్ ను క్యారీ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..