మహజూజ్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయ మహిళ..
- November 26, 2021
దుబాయ్: మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారత మహిళ ఒకరు జాక్‌పాట్ కొట్టారు.లాటరీ టికెట్ కొన్న మొదటిసారినే ఆమెకు ఇలా అదృష్టం వరించడం విశేషం. దీంతో ఆమె లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.దుబాయ్‌లో గురువారం నిర్వహించిన మహజూజ్ 52వ వీక్లీ డ్రాలో ఈ ముగ్గురు ప్రవాసులు చెరో 100,000 దిర్హమ్స్ గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన విద్య(31), లెబనాన్ పౌరులైన సుజానే(51), చార్బెల్(35) ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు.
విద్య మాట్లాడుతూ.. మహజూజ్ లాటరీలో పాల్గొన్న తొలిసారి ఇలా భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ర్యాఫిల్ ఐడీ నం:8131197 తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తాను గెలిచిన ప్రైజ్‌మనీలో అధిక భాగం తన కూతురి భవిష్యత్తు కోసం వినియోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మహజూజ్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, విద్య షార్జాలో సర్వీస్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. అటు మరో మహిళ విజేత సుజానే సైతం భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన నగదులో కొంత మొత్తం చారిటీకి ఉపయోగిస్తానన్నారు. ఆమె అబుధాబిలో ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!