‘మరక్కార్’ సెన్సార్ పూర్తి
- November 26, 2021మలయాళం సూపర్ స్టార్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్’. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. కానీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. ‘మరక్కార్’ సినిమా మీద మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన ‘మన్యం పులి’ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ‘మరక్కార్’ను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్