దుబాయ్ స్టాక్ మార్కెట్‌లోకి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్

- November 30, 2021 , by Maagulf
దుబాయ్ స్టాక్ మార్కెట్‌లోకి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ పబ్లిక్ ఆపరింగ్ కోసం సన్నాలహాలు చేస్తోందని ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్ టిమ్ క్లార్క్ వెల్లడించారు. స్థానిక స్టాక్ మార్కెట్‌లో జోరు పెంచేలా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ట్రేడింగ్ యాక్టివిటీని ప్రోత్సహించేందుకోసం 2 బిలియన్ దిర్హాముల మార్కెట్ మేకర్ ఫండ్ సిద్ధం చేయనుంది 10 ప్రభుత్వ సంస్థలను స్టాక్ ఎక్స్ఛేంజి పరిధిలోకి తీసుకురావడం ద్వారా. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వాలు బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎయిర్‌లైన్స్‌లలో పెట్టాయని, ఎమిరేట్స్ సుమారుగా 3.8 బిలియన్ డాలర్లను ఈక్విటీ ఇంజెక్షన్ల రూపంలో అందుకుందనీ, గత ఏడాది ఈ విలువ 2 బిలియన్ డాలర్లుగా వుందని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 5.8 బిలియన్ దిర్హాముల నష్టాన్ని ఎయిర్‌లైన్ చవిచూసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com