కె-నెట్ ఔట్‌లెట్ల ద్వారా 2021 తొలి పది నెలల్లో 18 బిలియన్ KD లావాదేవీ

- December 01, 2021 , by Maagulf
కె-నెట్ ఔట్‌లెట్ల ద్వారా 2021 తొలి పది నెలల్లో 18 బిలియన్ KD లావాదేవీ

కువైట్‌: కువైట్‌లో నివాసితులు అలాగే పౌరులు 18 బిలియన్ కువైటీ దినార్లను కె-నెట్ ఔట్‌లెట్ల ద్వారా 2021 తొలి పది నెలల్లో వెచ్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 9.5 బిలియన్ కువైటీ దినార్లను పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల ద్వారా, 8.5 బిలియన్ కువైటీ దినార్లు ఎలక్ట్రానిక్ విధానంలోనూ ఏటీఎం ద్వారా (నగదు తీసుకోవడం) చేసినట్లు షేర్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కంపెనీ (కె-నెట్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దలాల్ అల్ యాకూత్ వెల్లడించారు. మొత్తం పేమెంట్ లావాదేవీల మొత్తం 420 మిలియన్లుగా వుంది. ఇందులో 282 మిలియన్ల పేమెంట్ లావాదేవీలు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల ద్వారా జరిగితే, 138 మిలియన్ లావాదేవీలు ఎలక్ట్రానిక్ చెల్లింపులు, ఏటీఎం విత్‌డ్రాలు వున్నాయి. 940,000 పైగా కార్యకలాపాలు సగటున రోజూ జరిగాయి. సగటున నెలకి 28.2 మిలియన్ లావాదేవీలు జరిగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com