సుప్రీం రిలీజ్ కు సరైన డేట్ కోసం
- March 23, 2016
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సుప్రీమ్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. అంతేకాదు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుప్రీమ్ రిలీజ్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.మార్చి 25న ఊపిరి సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ మీద సమ్మర్ సినిమా సందడి ప్రారంభమవుతోంది. తరువాత వరుసగా సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం, కబాలి చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.అన్నీ భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కావటంతో ఒక్కో సినిమాకు రెండు వారాల గ్యాప్ కంపల్సరీ. దీంతో సుప్రీం రిలీజ్ కు సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.ఇటీవల కృష్ణాష్టమి సినిమా విషయంలో కూడా బాగా ఆలస్యం చేసి ఇబ్బందులు పడ్డ దిల్ రాజు, ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏప్రిల్ 10న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత సరైన గ్యాప్ చూసుకొని సినిమా రిలీజ్ కు డేట్స్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







