ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం..
- December 03, 2021
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. నేటి నుండి విదేశాల నుంచి ముఖ్యంగా ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారి పై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.ఎయిర్ పోర్ట్‌లో rtpcr పరీక్షలు నిర్వహించి నాలుగు గంటల్లో రిపోర్ట్ ఇవ్వనున్నారు.ఎవరికైనా పాజిటివ్ వస్తే టీమ్స్ అసుపత్రి కి తరలించి, చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేశారు.నెగిటివ్ వస్తే వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే వారి శాంపిల్ కలెక్షన్లో 5 శాతం జినోమ్ సీక్వెన్స్ టెస్ట్‌కు పంపుతారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారందరి స్వాప్ కలక్షన్ జినోమ్ సీక్వెన్స్‌కు తరలిస్తారు.
బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు.ఆమె శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్స్‌కు పంపించామని చెప్పారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు 325 మంది రాగా అందులో ఈ మహిళకు పాజిటివ్ వచ్చిందని.. ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 72 మంది ఏపీకి చెందిన వారు కాగా.. 239 తెలంగాణకు చెందిన వారిగా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
డిసెంబర్ చివరి వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 25 దేశాలలో 215 కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. ఆఫ్రికాలో సరిగ్గా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే కొత్త వెరియంట్ పుట్టుకొంచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని పేర్కొన్నారు. 47 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు.
వాక్సిన్ వేసుకొని వారు ఇప్పటికైనా వాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చేల్, రంగారెడ్డి జిల్లాలో సెకండ్ డోస్ టైమ్ ఐపోయిన వారు 15 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







