డిసెంబర్ 4 నుంచి తొలి ఫేస్ ఇ-ఇన్వాయిస్ తప్పనిసరి చేయనున్న సౌదీ అరేబియా

- December 04, 2021 , by Maagulf
డిసెంబర్ 4 నుంచి తొలి ఫేస్ ఇ-ఇన్వాయిస్ తప్పనిసరి చేయనున్న సౌదీ అరేబియా

రియాద్: ఇ-ఇన్వాయిసింగ్ (ఫతూరాహ్) తొలి ఫేజ్ అమలు డిసెంబర్ 4 శనివారం నుంచి సౌదీ అరేబియా ప్రారంభించనుంది. విలువ ఆధారిత పన్నుకి లోబడి పన్ను చెల్లింపుదారులు ఎలక్ట్రానిక్ విధానంలో చేసే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది. సంబంధిత అవసరాల నిమిత్తం ఇ-ఇన్వాయిసింగ్ సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు తొలి ఫేజ్‌లో. రాతపూర్వక ఇన్వాయిస్‌లు ఇకపై చెల్లవు. ఎలక్ట్రానిక్ విధానంలో ఇన్వాయిస్ జారీ చేయనిపక్షంలో 5,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. క్యుఆర్ కోడ్ లేకపోయినా ఈ జరీమానా వర్తిస్తుంది. ఇ-ఇన్వాయిస్ విషయంలో అనధికారిక మార్పులు చేర్పులు చేస్తే 10,000 దిర్హాముల జరీమానా తప్పదు. 2023 జనవరి 1 నుంచి రెండో ఫేస్ ఇ-ఇన్వాయిసింగ్ అమల్లోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com