వాలంటరీ సర్వీస్ లో బహ్రెయిన్ రికార్డు
- December 05, 2021
బహ్రెయిన్: ఎకనామిక్, సోషల్ డెవలప్ మెంట్ రంగాల్లో అభివృద్ధి కోసం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వాలంటీర్ డేని జరుపుకోనున్నారు. బహ్రెయిన్ లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వలంటీర్ డే ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సేవలో బహ్రెయిన్ గొప్ప రికార్డును కలిగి ఉందని లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మహ్మద్ అలీ హుమైదాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశం కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి అవసరమైనప్పుడు అధికారిక సంస్థలకు మద్దతు ఇవ్వడానికి బహ్రెయిన్లు ఆసక్తికి ఇటీవలి కరోనావైరస్ మహమ్మారి సజీవ రుజువన్నారు. ఈ ఆన్యువల్ ఈవెంట్ స్వచ్ఛంద, సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యకర్తలందరికీ నివాళులు అర్పించే అవకాశాన్ని కల్పిస్తుందని హుమైదాన్ అన్నారు. HM ది కింగ్స్ రిఫార్మ్ ప్రాజెక్ట్ ల ఫలితంగా బహ్రెయిన్‌లో సోషల్ సర్వీస్ ప్రొఫెషనర్ డ్యూటీలో భాగమైందన్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ పర్యవేక్షణలో 632 NGOలు ఉన్నాయని చెప్పారు. ఇది వలంటీర్ల వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బహ్రెయిన్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ కోసం ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ A/RES/40/212 ద్వారా 17 డిసెంబర్ 1985న గుర్తించింది. వలంటీర్ సర్వీస్ ప్రాధాన్యత, సహకారంపై అవగాహన కల్పించడంతోపాటు యూత్ ను ప్రోత్సహించాలని లక్ష్యంగా ఏటా ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ని నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు