డొమెస్టిక్ లేబర్ నిర్భంద కేంద్రం తొలగింపు.. క్వారంటైన్ సెంటర్ గా ‘ఖైతాన్’ స్కూల్

- December 05, 2021 , by Maagulf
డొమెస్టిక్ లేబర్ నిర్భంద కేంద్రం తొలగింపు.. క్వారంటైన్ సెంటర్ గా ‘ఖైతాన్’ స్కూల్

కువైట్: కాంట్రవర్సీగా మారిన ఖైతన్ స్కూల్ వ్యవహారం మొత్తానికి  కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం దాంట్లో కొనసాగుతున్న డొమెస్టిక్ లేబర్ నిర్బంధ కేంద్రాన్ని అధికారులు తొలగించారు. కొన్నాళ్ల పాటు దీన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న హోటలల్లో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఈ నిర్ణయం  తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఖైతాన్ స్కూల్ విషయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలాంటి వివాదం లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  స్కూల్లోని బ్లాక్ 4లో  డొమెస్టిక్ లేబర్స్ ఇన్ స్టిట్యూషన్ ను రన్ చేస్తున్నారు. ఐతే దీన్ని  క్వారంటైన్ సెంటర్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించటంతో వివాదం రేగింది. మొత్తానికి అధికారులు సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్న స్థానికులను కన్విన్స్ చేసి ఖైతాన్ స్కూల్ క్వారంటైన్ సెంటర్ గా మార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com