ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ జెండా ఇదే!
- December 05, 2021
ముంబై:మన జెండా.. మువ్వన్నెల పతాకం మన జాతి ఔన్నత్యానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జాతీయ జెండా ఆషామాషీగా లేదు.చాలా పెద్దది. జాతీయ జెండా 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మన జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో దీన్ని ప్రదర్శించారు. ఈ భారీ జెండాను ఖాదీతో తయారుచేయడం విశేషం.
ఇంతకు ముందు లడఖ్‌లోని లేహ్‌లో అతి పెద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అప్పట్లో అదే అతిపెద్ద జాతీయ జెండాగా ఖ్యాతిపొందింది. 2021 అక్టోబర్ 02 న మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా లడఖ్‌లోని లేహ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈజాతీయ జెండాను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ ఎగురవేశారు.
ఖాదీ గ్రామం, పరిశ్రమల కమిషన్‌కు అనుబంధంగా ఉన్న ముంబైలో ఉన్న ఖాదీ డైయర్స్ ప్రింటర్స్ ఈ జెండాను తయారు చేశారు. ముంబై నుండి లేహ్‌కు జాతీయ జెండాను తీసుకువచ్చే బాధ్యత, ఆవిష్కరణ వేడుక కోసం ఎత్తైన పర్వతాల పైభాగంలో దాన్ని ఇన్స్టాల్ చేసే బాధ్యతను కూడా సూరా-సోయి ఇంజనీర్ రెజిమెంట్‌కు అప్పగించారు. ఈ త్రివర్ణం 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కలిగి వుంది. దీని బరువు దాదాపు 1,000 కిలోలు. ఈ జెండా కంటే ఇప్పుడు ముంబైలో ప్రదర్శించిన జాతీయ జెండా బరువు 400 కేజీలు ఎక్కువ. పొడవు, వెడల్పు సమానమే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!