సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభానికి హాజరైన క్రౌన్ ప్రిన్స్

- December 06, 2021 , by Maagulf
సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభానికి హాజరైన క్రౌన్ ప్రిన్స్

సౌదీ అరేబియా: జెద్దాలో అదివారం జరిగిన సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ ప్రారంభోత్సవానికి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ హాజరయ్యారు. క్రౌన్ ప్రిన్స్ తో పాటు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ షీక్ స్ల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా ఉన్నారు. యువరాజు ముహమ్మద్‌కు స్పోర్ట్స్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్ఫైసల్ ఘన స్వాగతం పలికారు. ఈ వారాంతంలో జెడ్డా కార్నిచ్ స్ట్రీట్ ట్రాక్‌లో సౌదీ అరేబియా ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభం కాబోతున్నది. దీనికి సన్నాహాకంగా ఫార్ములా టూ ను నిర్వహిస్తున్నారు. 6.1-కిమీ పొడవున్న ఈ ట్రాక్.. ఇటాలియన్ 'టెంపుల్ ఆఫ్ స్పీడ్' మోన్జా తర్వాత రెండవ వేగవంతమైనది. ఇది ప్రధానంగా ఫ్లాట్-అవుట్ బ్లాస్ట్ లు, గోడలతో.. బ్లైండ్ స్వీప్‌లతో రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com