ఒమన్ లో అజీజ్ అల్ సౌద్.. ఒమన్-సౌదీ సహకారానికి కొత్త శకం
- December 06, 2021
ఒమన్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, డిఫెన్స్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మనిస్టర్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సోమవారం ఒమన్ సుల్తానేట్‌ను సందర్శించనున్నారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఈ పర్యటన పెంచుతుందని రాయల్ కోర్ట్ దివాన్ ప్రకటించింది. ఈ ఏడాది జులైలో సౌదీ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, అతని సోదరుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌ల సమావేశంలో నిర్ణయం తీసుకున్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ పర్యటనకు వచ్చినట్లు పేర్కొంది. సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, సౌదీ అరేబియా అన్ని రంగాలలో ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సహకారాన్ని కొత్త దశకు తీసుకుపోనున్నాయని తెలిపింది. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఒమన్ సుల్తానేట్‌కు సందర్శన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) చైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ అన్నారు. ఒమన్ విజన్ 2040, సౌదీ విజన్ 2030లను ముందుకు తీసుకెళ్లడంతో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పర్యటన తోడ్పడుతుందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..