'యశోద'గా సమంత...
- December 06, 2021_1638785977.jpg)
హైదరాబాద్: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. సమంత నటనకు వీక్షకులు సహా, విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో సమంత చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియల్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలోనూ దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు” అని చెప్పారు. తమిళంలో ‘మైనా’, ‘కుంకీ’, ‘గీతు’… తెలుగులో ‘చి.ల.సౌ.’, ‘రిపబ్లిక్’ తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ‘యశోద’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. హరి – హరీశ్ జంట దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు సినీ పాత్రికేయులు, గీత రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ సంభాషణలు అందిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!