గూగుల్‌ వాయిస్‌ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్‌

- March 23, 2016 , by Maagulf
గూగుల్‌ వాయిస్‌ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్‌

బెల్జియం, టర్కీ దేశాల్లోని ప్రజలకు హాంగ్‌అవుట్‌, హాంగ్‌అవుట్‌ డయలర్‌, గూగుల్‌ వాయిస్‌ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ బుధవారం ప్రకటించింది. మొబైల్‌ నెట్‌వర్క్‌లతో పాటు.. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నంబర్లకు కూడా ఉచిత కాలింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
బ్రస్సెల్స్‌ దాడులు బాధాకరమని.. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు గూగుల్‌ సంతాపం ప్రకటించింది.బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 35 మంది మృతిచెందగా.. 200మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ సేఫ్టీ చెక్‌ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com