భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- December 07, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,79,384 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,822 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,48,383కి చేరింది. నిన్న ఒక్క రోజే 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,73,757కి చేరింది.
నిన్న10,004 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,79,612కి చేరింది. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది.నిన్న 79.3లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 128.76కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







