మంత్రగాడి పాత్రలో కమల్
- March 23, 2016
ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ హరర్ కామెడీ. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుండగా, సీనియర్ హీరోలు కూడా ఈ జానర్ సినిమాలపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. వెరైటీ రోల్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన కమల్ కూడా ఇప్పుడు ఓ దెయ్యాల సినిమాని చేసేందుకు సిద్దమయ్యారు.సకల కళావల్లభుడిగా అశేషజనాదరణ పొందిన కమల్ ఇప్పటి వరకు పలు వైవిధ్యమైన పాత్రలలో నటించి అందరి మెప్పు పొందారు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా ఒకటేంటి అనేక భాషలలో తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు పసందైన విందు అందిస్తున్నారు కమల్ . అయితే ఇటీవల చీకటి రాజ్యం సినిమాతో ముందుకు వచ్చిన కమల్ ఆ తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు .
అముదీశ్వర్ 'మీంకుజాంబం మన్ పానయుం ' అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో మంత్రగాడి పాత్రను కమల్ చేయనున్నారు. ఈ పాత్ర చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఆత్మలను బంధించే శక్తివంతుడిగా, వాటి విద్యలు తెలిసిన మేధావిగా కమల్ పాత్ర ఉండనున్నట్టు సమాచారం. కాళి దాస్ జయరాం, అష్టా జవేరి,ప్రభు, పూజా కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శివాజీ గణేశన్ మనవడు దుష్యంత్ కుమార్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







