‘కె.జి.ఎఫ్ -2’ డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్!

- December 07, 2021 , by Maagulf
‘కె.జి.ఎఫ్ -2’ డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్!

ముంబై: పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని చాలామంది ‘బాహుబలి’తో పోల్చారు. ఆ మూవీ సరసన నిలబడదగ్గ చిత్రంగా కొనియాడారు. కన్నడంతో పాటు అప్పట్లోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్‌.’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘బాహుబలి’ తరహాలోనే దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘చాప్టర్ -2’ షూటింగ్ కొద్ది భాగమే బాలెన్స్ పెట్టుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ మాత్రం షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో చాప్టర్ -2లో అధీరా పాత్ర పోషించిన సంజయ్ దత్ సైతం అనారోగ్యం పాలు కావడంతో మరికొంత ఆలస్యమైంది.

ఎట్టకేలకు ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ షూటింగ్ ను ఆ మధ్య పూర్తిచేసిన ప్రశాంత్ నీల్, డబ్బింగ్ కార్యక్రమాలూ మొదలు పెట్టేశాడు. అందులో భాగంగానే బాలీవుడ్ క్రేజీ యాక్టర్ సంజయ్ దత్ తోనూ డబ్బింగ్ చెప్పించాడు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేశాడు. సంజయ్ దత్ డబ్బింగ్ సెషన్ పూర్తి అయినట్టు అందులో ప్రకటించాడు. యశ్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రామచంద్రరాజు, అనంత్ నాగ్, మాళవిక అవినాశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కె.జి.ఎఫ్‌. చాప్టర్ 2’ వరల్డ్ వైడ్ వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com