నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం..38 మంది ఖైదీల సజీవదహనం..

- December 07, 2021 , by Maagulf
నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం..38 మంది ఖైదీల సజీవదహనం..

నైరోబి: బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 38 మంది ఖైదీలు మరణించారు. మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు తెలిపారు. ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని వైస్ ప్రెసిడెంట్ ప్రాస్పర్ బజోంబాంజా తెలిపాయి. అయితే గీతేగా జైలు మంటలకు కారణమేమిటో చెప్పలేదు. మరణించిన వారిలో చాలా మంది వృద్ధ ఖైదీలు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై అధికారులెవరు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది. “మంటలు చాలా ఎక్కువగా ఎగసిపడటం చూశామని, సజీవ దహనం అవుతున్నామని అరవడం ప్రారంభించాము, కాని పోలీసులు మా క్వార్టర్స్ తలుపులు తెరవడానికి నిరాకరించారని ప్రత్యక్ష సాక్షి అయిన ఖైదీ ఒకరు చెప్పారు. “నేను ఎలాగో తప్పించుకున్నాను , కానీ పూర్తిగా కాలిపోయిన ఖైదీలు ఉన్నారు.” అని చెప్పుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బురుండిలోని రెడ్‌క్రాస్ బృందాలు బాధితులను ఆదుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా ఉన్న మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com