కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ ప్రభుత్వం
- December 09, 2021
కువైట్ సిటీ: కువైట్ ఇటీవల మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను కూడా ఆర్మీలో చేరే అవకాశం కల్పిస్తూ అక్టోబర్‌లో కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా బుధవారం మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు.ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న మహిళల కోసం డిసెంబర్ 19 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు."మేము మహిళలను సైన్యంలో చేరమని బలవంతం చేయలేదు.సైన్యంలోని పురుష అధికారులతో సమానమైన ప్రయోజనాలను పొందడానికి మాత్రమే మేము వారికి అవకాశం ఇచ్చాము" అని మంత్రి అన్నారు. కువైటీ మహిళలు ఇప్పటికే రక్షణశాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఆసక్తి ఉన్నవారు సైన్యంలో చేరే ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా తెలియజేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!