కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ ప్రభుత్వం

- December 09, 2021 , by Maagulf
కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ ప్రభుత్వం

కువైట్ సిటీ: కువైట్ ఇటీవల మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను కూడా ఆర్మీలో చేరే అవకాశం కల్పిస్తూ అక్టోబర్‌లో కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా బుధవారం మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు.ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న మహిళల కోసం డిసెంబర్ 19 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు."మేము మహిళలను సైన్యంలో చేరమని బలవంతం చేయలేదు.సైన్యంలోని పురుష అధికారులతో సమానమైన ప్రయోజనాలను పొందడానికి మాత్రమే మేము వారికి అవకాశం ఇచ్చాము" అని మంత్రి అన్నారు. కువైటీ మహిళలు ఇప్పటికే రక్షణశాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఆసక్తి ఉన్నవారు సైన్యంలో చేరే ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com