మీడియాకు క్షమాపణలు చెప్పిన జక్కన్న
- December 09, 2021
ముంబై: దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్ అనంతరం ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశారు.
మీడియాను ఆహ్వానించిన తరువాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడంతో మీడియాకు జక్కన్న క్షమాపణలు కోరారు. “ప్రెస్మీట్ అనుకున్నా.. అయితే ఫ్యాన్స్ కూడా రావడంతో మీడియాకు ఇబ్బంది అయింది, అందుకే హీరోలను తీసుకురాలేదు.రెండు రోజుల్లో మీడియాకు ప్రత్యేక సమావేశం ఉంటుంది.ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినందుకు క్షమించాలి” అని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







