‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీకి తేదీ ఖరారు
- December 09, 2021
హైదరాబాద్: అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం.ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“థియేటర్లో కన్నా ముందే మాస్ పార్టీ.. మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లింప్స్..పుష్ప మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ..డిసెంబర్ 12 న” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రానున్నారో చెప్పకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈవెంట్ కి గెస్ట్ లు ఎవరైనా వస్తున్నారా ..? అని ప్రశ్నిస్తున్నారు.కాగా, ఈ ఈవెంట్ కి ప్రభాస్, చిరు, షాహిద్ కపూర్ గెస్టులుగా వస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి.కానీ, మేకర్స్ అందులో ఒక్కరిపేరు కూడా చెప్పకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







