భారత సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతులకు కువైట్ అమీర్ సంతాపం
- December 10, 2021
కువైట్: ఇండియాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు గురువారం లేఖ పంపారు. ప్రమాదంలో గాయపడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా కూడా ప్రమాదంపై తమ సంతాపం తెలియజేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి ,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







