వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ

- December 10, 2021 , by Maagulf
వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ

సౌదీ: వాట్సాప్ యూజర్స్ వెంటనే తమ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్ సూచించింది. ప్రస్తుత వాట్సాప్ యాప్ లో యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. సౌదీ లో  వాట్సాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను హ్యాకర్లు సులువుగా ఉపయోగించుకునేలా ఉందన్నారు. ఆండ్రాయిడ్ 2.21.22.7, ఆండ్రాయిడ్ 2.21.22.7 కోసం వాట్సాప్ అప్‌డేట్‌ను విడుదల చేసినట్లు వివరించింది. వాట్సాప్ లో ఇమేజ్ ను పంపుతున్న హ్యాకర్లు.. దాన్ని తెరవగానే యజర్ డేటాతోపాటు నెట్‌వర్క్ లు, పరికరాల యాక్సెస్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ అప్ డేట్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అని సెర్చ్ చేసి..  ఆపై 'అప్‌డేట్' బటన్ ను నొక్కాల్సి ఉంటుందని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com