కువైట్ లో బిపిన్ రావత్ కు ఘన నివాళి

- December 11, 2021 , by Maagulf
కువైట్ లో బిపిన్ రావత్ కు ఘన నివాళి

కువైట్ సిటీ: అహర్నిశలు జన్మభూమి కోసం తమ జీవితాలను తల్లి భరతమాతకు అంకితం చేసిన భారతదేశ రక్షకుకులు,గొప్ప దేశభక్తులు ఛీప్ ఆఫ్ డిఫెన్స్ జనరల్  CDS బిపిన్ రావత్ కి మరియు ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి  చేకూరాలని తెలంగాణ జాగృతి కువైట్ టీం ఘన నివాళులర్పించారు.

భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు, వీర యోధుడు  బిపిన్ రావత్, మరియు సైనికులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం అత్యంత బాధాకరమని తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల తెలిపారు.

10వ తేదీ(శుక్రవారం) శ్రద్ధాంజలి కార్యక్రమంలో అమరవీరుల చిత్ర పటానికి తెలంగాణ జాగృతి కువైట్ కోర్ టీం సభ్యులు ప్రమోద్ కుమార్ మార్క, మామిడిపల్లి రాజన్న, కొత్తపల్లి రవి సూర్య,సాయి కలసి నివాళులర్పించారు. 
                                                                                                           
అనంతరం యుటిఎఫ్ అధ్యక్షులు కోడూరు వెంకట్ మాట్లాడుతూ...భారతదేశం గొప్ప పోరాట యోధుడు కోల్పోయిందన్నారు.ప్రమాదం లో మృతి చెందిన జవానుల అత‌్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించి నివాళులర్పించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com