‘మా’ సభ్యులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- December 12, 2021
హైదరాబాద్: కరోనా అన్ని రంగాల వ్యక్తులపైనా తీవ్ర ప్రభావం చూపింది.సినీ కళాకారులపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది.మహమ్మారి తీవ్రతకు ఎంతోమంది కళాకారులు ఆర్థికంగా మాత్రమే కాదు ఆరోగ్య పరంగానూ తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు.ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల ఆరోగ్యానికి భరోసానందిస్తూ మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్స్, దాదాపు 5000 రూపాయల విలువ కలిగిన తమ మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను పూర్తి ఉచితంగా ‘మా ’సభ్యులకు అందించింది.మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ పరీక్షలను చేశారు.
‘‘వైద్య పరంగా తాము ప్రజలకు సేవ చేస్తుండవచ్చు కానీ మానసికంగా ప్రజలు ఉల్లాసంగా ఉండటానికి తద్వారా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడేది కళాకారులే ! మన దగ్గర అధికశాతం మందికి వినోదమాధ్యమంగా సినిమానే నిలుస్తుంది.ఆ కళాకారులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే మనం కూడా ఉత్సాహంగా ఉండొచ్చు.అది దృష్టిలో పెట్టుకునే ఈ మాస్టర్ హెల్త్ చెక్ ప్యాకేజీలను మా సభ్యులకు ఉచితంగా అందించాం’’ అని డాక్టర్ అనిల్ కృష్ణ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్ అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ మా సభ్యులకు ఆరోగ్య, ఆర్ధిక పరమైన తోడ్పాటునందించే క్రమంలో మెడికవర్తో ఈ భాగస్వామ్యం చేసుకున్నాం. మా సభ్యులకు 5000 రూపాయల విలువ కలిగిన ఆరోగ్య పరీక్షలను ఉచితంగా చేసిన మెడికవర్ హాస్పిటల్స్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాం. ఈ తరహా మరిన్ని సేవలను మా సభ్యులకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం’’ అని అన్నారు.
మా సేక్రటరీ మెంబర్ నటుడు రఘు బాబు మాట్లాడుతూ ‘‘పేద సినీ కళాకారులెందరికో ఉపయోగపడే మహత్తర కార్యక్రమమిది. ఈ ఆరోగ్య పరీక్షల ద్వారా తమ ఆరోగ్య స్థితి తెలుసుకోవడంతో పాటుగా తగిన జాగ్రత్తలను తీసుకోవడమూ సాధ్యపడుతుంది. మా కార్యవర్గం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. మెడికవర్ హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
నటుడు, మా అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి మాట్లాడుతూ‘‘మా అసోసియేషన్ సభ్యులందరికీ ఈ పరీక్షలు ఉచితంగా లభించాయి. దాదాపు 250 మందికి పైగా సభ్యులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఓపికతో సినీ మా కళాకారుల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా తగిన చికిత్సలను సూచించిన మెడకవర్ హాస్పిటల్స్ సిబ్బందికి ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ డియంఎస్ డాక్టర్ రాకెష్ మాట్లాడుతూ ‘‘మెరుగైన వైద్య సేవలకు మెడికవర్ సుపరిచితం. ఈ కార్యక్రమం కోసం మా అసోసియేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మా మాజీ ప్రెసిడెంట్ సీనియర్ నరేష్ గారు,మెంబర్ శివ బాలాజీ ఇతర సభ్యులు మరియు మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ దుర్గేష్ , సెంటర్ హెడ్స్ - మాత ప్రసాద్, అనిల్ మరియు స్వప్నిల్ రాయ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!