దోహా-ఖతార్ తెలంగాణ ఎన్నారై ప్రొఫెషనల్స్ చే "వేకువ ఫౌండేషన్" స్థాపన
- June 08, 2015
ఖతార్ తెలంగాణ ప్రవాసీ ప్రతినిధులు కర్ర రాజేష్, గడ్డల రాజేశం, మాతంగి సతీష్ 8 జూన్ 2015 న హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
జూన్ 11న "వేకువ ప్రారంభ వేడుక” మరియు “తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం” దోహా- ఖతార్ లో జరుపుకోనున్నారు విధ్య, నైపుణ్యం మరియు ఉపాధి అంశాలపై సాద్యమైనంత తమ సహకారం అందజేసి మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అని వీరు బలంగా నమ్ముతూ, మాతృభూమికి సేవచేసే అవకాశంగా భావిస్తున్నారు.
"వేకువ" సంస్థ తెలంగాణ వ్యాప్తంగా "మేధ "ప్రాజెక్ట్ ద్వారా 40 పాఠశాలలు ఎంపిక చేసి అందులో ఉన్న 5,000 కు పైగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
తదుపరి ప్రాజెక్ట్ “ప్రేరణ” ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 80 నుండి 100 ప్రాంతాలలో, ఒక్కో ప్రాంతానికి 500 మంది విద్యార్థుల చొప్పున ఈ విధ్యా సంవత్సరంలో 50000 మంది విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి అనుభజ్ఞులైన మనోవికాస నిపుణలచే ప్రేరణ తరుగతులు నిర్వహించడం జరుగుతుంది.
ప్రాజెక్ట్ “లక్ష్య” ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రేరణ కలిగించడానికి మా సభ్యులు, వారి మిత్రులు మరియు వారి బంధువులచే రూపొందించబడిన కార్యక్రమం. మా సభ్యుల భారతదేశ పర్యటనలో వారు తెలంగాణలో గడిపే సమయంలో వారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2280 వసతి గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు.
--యం.భీం రెడ్డి(జగిత్యాల్)
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









