112 మంది భారతీయులకు పాక్ వీసా
- December 15, 2021
న్యూఢిల్లీ : పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలను సందర్శించేందుకు 112 మంది భారతీయులకు పాక్ మంగళవారం వీసాలు జారీ చేసింది.
ఈ నెల 17 నుంచి 23 వరకు కటాస్ ఆలయాల సముదాయం సందర్శించేందుకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ తెలిపింది. కటాస్ ఆలయాలు చెరువు చుట్టూ ఉండగా.. వాటిని సందర్శించడాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు.
1974లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు వీసాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ భారతీయ యాత్రికుల కోసం వీసాలు ఇస్తున్నది. ఈ నెల 4న సింధ్‌లోని షాదానీ దర్బార్ హయత్ పిటాఫీలో సద్గురు సంత్ షాదరామ్ సాహిబ్ 313వ జయంతి వేడులకు హాజరయ్యేందుకు 136 మందికి పాక్ హైకమిషన్ వీసాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







