బూస్టర్‌డోస్‌గా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ కు ఈయూ అనుమతి

- December 15, 2021 , by Maagulf
బూస్టర్‌డోస్‌గా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ కు ఈయూ అనుమతి

లండన్‌ : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యూరోపియన్‌ యూనియన్‌లో విలయం సృష్టిస్తున్నది. కొత్త స్ట్రెయిన్‌ బారినపడ్డ ఓ వ్యక్తి ఇప్పటికే మరణించాడు.

ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన కొవిడ్‌-19 టీకాను బూస్టర్‌ డోసుగా వేసేందుకు అనుమతి ఇచ్చింది.

ఈయూ డ్రగ్‌ రెగ్యులేటర్‌ బుధవారం సిఫారసు చేసింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నా టీకాలతో పాటు యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (EMA) నిర్ధారించిన వ్యాక్సిన్ల (mRNA)లో ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడో డోసుగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. గత నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్‌తో యూకేలో ఓ వ్యక్తి మరణించిన అనంతరం ఆయూ దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.

టీకాతో రక్షణ వస్తున్నందున బూస్టర్‌ డోస్‌లు వేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఈయూ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఫైజర్‌, మోడెర్నా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ వేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాను సైతం బూస్టర్‌ డోస్‌ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com