‘ఖలీఫా’ ఆధ్వర్యంలో 2 మిలియన్‌ ఇఫ్తార్‌ మీల్స్‌

- June 08, 2015 , by Maagulf
‘ఖలీఫా’ ఆధ్వర్యంలో 2 మిలియన్‌ ఇఫ్తార్‌ మీల్స్‌

పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని ది ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఫౌండేషన్‌ 2 మిలియన్‌ ఇఫ్తార్‌ మీల్స్‌ని ముస్లిం సోదరులకు అందించనుంది. మొత్తం 105 లొకేషన్స్‌లో రమదాన్ అంతటా ఈ ఇఫ్తార్‌ మీల్స్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఫౌండేషన్‌ ప్రతినిథులు చెప్పారు. ఇప్పటికే ఈ మెగా ఛారిటీ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టిన ఫౌండేషన్‌, పేద వారికి పవిత్ర రమదాన్ మాసంలో సరైన భోజనం ఇచ్చేందుకు ఈ పని చేస్తున్నట్లు చెబుతోంది. ఖలీఫా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మహమ్మద్‌ హజి అల్‌ ఖౌరీ చెబుతూ ఇస్లాం బోధనలకు అనుగుణంగా ఈ ఇఫ్తార్‌ మీల్స్‌ ఛారిటీని చేపట్టామనీ, దేశమంతటా రమదాన్ మాసంలో ఇఫ్తార్‌ మీల్స్‌ ఎంపిక చేసిన చోట్ల అందించనున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com