కరోనా బూస్టర్ డోస్ తీసుకోండి-ప్రజలను నేషనల్ టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి
- December 16, 2021
బహ్రెయిన్: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవటానికి బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో బూస్టర్ డోస్ ప్రభావాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలు ఇప్పటికే నిరూపించాయని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తుచేశారు. బూస్టర్ డోస్ కూడా వ్యాక్సిన్ ప్రోటోకాల్ లో భాగమని అన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ ను కూడా వేసుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఇక పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించే విషయంలో వారి పేరెంట్స్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రతను బూస్టర్ డోస్ తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలిందని...అందుకే అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..