.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు..
- March 24, 2016
సీనియర్ తెలుగు నటుడు మంచు మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు. తెలుగులో 500 పైగా చిత్రాల్లో నటించిన మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? ఇదేదో సినిమా షూటింగ్ కోసమని పొరబడకండి.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్‌బాబు ఈ పని చేశారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మారు. ఈ విషయాన్ని శ్రీ విద్యానికేతన్ కళాశాల తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మోహన్‌బాబు ఇడ్లీలు అమ్ముతుండగా తీసిన ఫొటోలను పోస్టు చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'మేము సైతం' సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నటీనటులు రకుల్‌ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తారు. అక్కినేని అఖిల్ ఆటో నడపగా, శ్రియ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







