ముగింపు దశకు రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. 92 శాతం పనులు పూర్తి

- December 17, 2021 , by Maagulf
ముగింపు దశకు రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. 92 శాతం పనులు పూర్తి

సౌదీ-రియాద్: సౌదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రియాద్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 92 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు రియాద్ సిటీ రాయల్ కమిషన్ ప్రకటించింది. కమిషన్ సలహాదారు హోసామ్ అల్-ఖురాషి గురువారం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం అల్-ఖురాషి మాట్లాడుతూ.. 180 మెట్రో ట్రైన్లు 2 మిలియన్ కిలోమీటర్ల ట్రయల్ రన్ పూర్తి చేశాయన్నారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ 2022 ఫస్ట్ క్వార్టర్ కల్లా పబ్లిక్ కు అందుబాటులోకి వస్తుందన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగమైన దీంట్లో మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు. రియాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటన్న అల్-ఖురాషి.. మొత్తం 1800 కి.మీ విస్తీర్ణంలో ఆరు ప్రధాన మెట్రో లైన్లు, 85 రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. రియాద్ మెట్రో అమల్లోకి వస్తే 2.50 లక్షల కార్ల ట్రిప్పులు మిగిలి 4 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, ఆ మేరకు కార్బన్ ఉద్గారాల శాతం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com