బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారనున్న ఎక్స్‌పో దుబాయ్ ప్రాంగణం

- December 17, 2021 , by Maagulf
బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారనున్న ఎక్స్‌పో దుబాయ్ ప్రాంగణం

 దుబాయ్: ఎక్స్‌పో దుబాయ్ 2020 మార్చి 2022లో ముగియనుంది. అనంతరం ఈ ప్రాంగణాన్ని బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా వినియోగించనున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ మేనేజిమెంట్ సిస్టమ్స్ వంటివాటితో డిస్ట్రిక్ట్ 2020 ప్రాజెక్టు రూపొందించనున్నారు. యూఏఈ రెసిడెంట్స్‌కి రెసిడెన్షియల్ మరియు బిజినెస్ హబ్‌గా ఇది మారబోతోంది. లెగసీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ నదిమెహ్ మెహ్రా మాట్లాడుతూ, స్కేల్ 2 దుబాయ్ పేరుతో కొత్త మార్కెట్ సృష్టించేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఉచితంగా వర్క్ స్పేస్, రెండేళ్ళ వీసా.. ఇలా ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించనున్నారు. డిస్ట్రిక్ట్ 2020లో 145,000 మంది నివసించడానికి, పని చేసుకోవడానికి, సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న 25 ఏళ్ళలో ఇదొక పెద్ద హబ్‌గా రూపాంతరం చెందనుంది. టెర్రా ది సస్టెయినబిలిటీ పెవిలియన్, పిల్లలకు సంబంధించిన అలాగే సైన్స్ సెంటర్‌గా సేవలందించనుంది. ఎక్స్‌పో కోసం జరిగిన ఏర్పాట్లు, ఇతర కార్యకలాపాలకు వీలుగా వున్నాయి. కొన్ని తాత్కాలిక ఏర్పాట్లను మాత్రం ఎక్స్‌పో తర్వాత తొలగించనున్నారు. వాటి స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com