దాకర్ ర్యాలీ: ఇద్దరు మహిళలకు లైసెన్స్ జారీ

- December 17, 2021 , by Maagulf
దాకర్ ర్యాలీ: ఇద్దరు మహిళలకు లైసెన్స్ జారీ

సౌదీ అరేబియా:ఇద్దరు మహిళా డ్రైవర్లకు సౌదీ దాకర్ ర్యాలీ 2022లో పాల్గొనేందుకు అవసరమైన లైసెన్సుల్ని జారీ చేయడం జరిగింది. దానియా అకీల్ మరియు మషాయెల్ అల్ ఒబైదాన్ అనే మహిళా డ్రైవర్లు ఈ లైసెన్సు పొందారు. ఈ లైసెన్సుల్ని పొందిన తొలి మహిళా డ్రైవర్లుగా ఈ ఇద్దరూ నిలిచారు. 44వ ఎడిషన్ దాకర్ ర్యాలీ జనవరి 1న ప్రారంభం కానుంది. అత్యధికంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో, రోజుకి 600 కిలోమీటర్ల మేర ప్రత్యేక పరిస్థితుల మధ్య వాహనాలు నడిపేలా ఈ ర్యాలీ వుంటుంది. 12 రోజులపాటు ఈ ర్యాలీ జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com