బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారనున్న ఎక్స్పో దుబాయ్ ప్రాంగణం
- December 17, 2021
దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 మార్చి 2022లో ముగియనుంది. అనంతరం ఈ ప్రాంగణాన్ని బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా వినియోగించనున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ మేనేజిమెంట్ సిస్టమ్స్ వంటివాటితో డిస్ట్రిక్ట్ 2020 ప్రాజెక్టు రూపొందించనున్నారు. యూఏఈ రెసిడెంట్స్‌కి రెసిడెన్షియల్ మరియు బిజినెస్ హబ్‌గా ఇది మారబోతోంది. లెగసీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ నదిమెహ్ మెహ్రా మాట్లాడుతూ, స్కేల్ 2 దుబాయ్ పేరుతో కొత్త మార్కెట్ సృష్టించేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఉచితంగా వర్క్ స్పేస్, రెండేళ్ళ వీసా.. ఇలా ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించనున్నారు. డిస్ట్రిక్ట్ 2020లో 145,000 మంది నివసించడానికి, పని చేసుకోవడానికి, సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న 25 ఏళ్ళలో ఇదొక పెద్ద హబ్‌గా రూపాంతరం చెందనుంది. టెర్రా ది సస్టెయినబిలిటీ పెవిలియన్, పిల్లలకు సంబంధించిన అలాగే సైన్స్ సెంటర్‌గా సేవలందించనుంది. ఎక్స్పో కోసం జరిగిన ఏర్పాట్లు, ఇతర కార్యకలాపాలకు వీలుగా వున్నాయి. కొన్ని తాత్కాలిక ఏర్పాట్లను మాత్రం ఎక్స్పో తర్వాత తొలగించనున్నారు. వాటి స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేస్తారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







