జాతీయ దినోత్సవ వేడుకల్ని నిర్వహించిన బహ్రెయిన్ స్కూల్

- December 17, 2021 , by Maagulf
జాతీయ దినోత్సవ వేడుకల్ని నిర్వహించిన బహ్రెయిన్ స్కూల్

మనామా: సంప్రదాయ పద్ధతుల్లో జాతీయ దినోత్సవ వేడుకల్ని బహ్రెయిన్ స్కూల్‌లో నిర్వహించారు.సంప్రదాయ సంగీతం, సోషల్ యాక్టివిటీస్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఎక్కువగా జనం గుమికూడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిడిల్ మరియు హై స్కూల్ విద్యార్థులు బహరెయినీ ఫోక్ ట్రూప్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వార్డ్ ఆఫ్ కేన్ డాన్సింగ్ నిర్వహించారు. ఇంటీరియర్ మినిస్ట్రీ పోలీస్ బ్యాండ్ అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాల్ని నేర్పుగా నిర్వహించడంలో తోడ్పాటునందించిన అరబిక్ టీచర్ అమాల్ మరౌఫ్, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com