ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ వజ్రాలు..
- December 17, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సారి భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి.రోజు రోజుకు కేటుగాళ్లు మితిమీరిపోతున్నారు.అధికారుల కంటబడకుండా ఉండేందుకు కొత్తకొత్త విధంగా విలువైన వస్తువులనై అక్రమంగా తరలిస్తున్నారు. అయితే తాజాగా హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా వ్రజాలను గుర్తించారు.
అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్‌లో వజ్రాలు ప్యాకింగ్ చేసి స్కానింగ్‌లో తెలియకుండా ఉండేందుకు కార్బన్ పేపర్‌ను చుట్టారు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా సుమారు 1.5 కోట్ల విలువ చేసే 5 వేల వజ్రాలు పట్టుబడ్డాయి. ఈ మేరకు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు వజ్రాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







