భారత్లో కరోనా కేసుల వివరాలు
- December 18, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 84,565 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 289 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు మొత్తం 4,77,158 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 3,46,24,360 గా నమోదు అయింది. మరోవైపు భారత్లో ఇప్పటి వరకు మొత్తం 1,36,66,05,173 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!







