సీరం కోవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి WHO గ్రీన్ సిగ్నల్
- December 18, 2021
జెనీవా: కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటున్న వేళ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని అంతా కోరుకుంటున్నారు.WHO కోవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో చిన్నారుల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్ ట్రయల్ జరుగుతున్నాయి. టీకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా నుంచి కాపాడుతుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సీరం సంస్థ ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం తయారు చేసింది. కోవిడ్ వల్ల పిల్లల్లో తీవ్రమైన ఇబ్బందులు అంతగా కనిపించకపోయినా త్వరగా టీకా తేవడానికి సీరం పనిచేస్తోందన్నారు. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా పిల్లల టీకా మార్కెట్లోకి తీసుకువస్తామని, మూడేళ్లలోపు పిల్లలకు అందుబాటులో ఉంటుందని సీరం ఇనిస్టిట్యూట్ అంటోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







