భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్
- December 18, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి.స్పామ్ కాల్స్ పై ట్రూకాలర్ ఓ నివేదికను తయారు చేసింది.ఈ నివేదిక ప్రకారం దేశంలో రోజు రోజుకు స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయని, గతేడాది స్పామ్ కాల్స్ విషయంలో 9 వ స్థానంలో ఉన్న భారత్,ఈ ఏడాది 4 వ స్థానానికి చేరిందని ట్రూకాలర్ పేర్కొన్నది.ఓ స్పామ్ కాల్ నెంబర్ నుంచి 6 లక్షల 40 వేల మందికి 20 కోట్ల సార్లు కాల్స్ వెళ్లాయని ట్రూకాలర్ తెలియజేసింది.దీన్ని బట్టి దేశంలో స్పామ్ కాల్స్ ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి గంటకు 27 వేల మందికి స్పామ్ కాల్స్ వెళ్లినట్టు నివేదికలో పేర్కొన్నది. ప్రపంచంలో స్పామ్ కాల్స్‌ను ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, పెరూ రెండో స్థానంలో నిలిచింది. స్పామ్ కాల్స్‌లో అత్యథికశాతం మార్కెటింగ్ లేదా టెలిమార్కెటింగ్ కోసమే చేసినవని ట్రూకాలర్ పేర్కొన్నది. అక్టోబర్ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!







